AP: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పలు రాష్ట్రాల సీఎంలు, సినీ నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, మాజీ క్రికెటర్ సచిన్ తదితరులు హాజరయ్యారు.