గ్రామదేవతకు సీఎం చంద్రబాబు పూజలు
AP: సీఎం చంద్రబాబు రెండోరోజు మంగళవారం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు చేసింది. నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్ తదితరులు పాల్గొన్నారు.