ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారినట్లు ఓ నివేదిక విడుదలైంది. 2018 నుంచి 2024 మధ్య విద్యా ప్రమాణాలపై ఏఎస్ఈఆర్ అనే సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో 2022-24 మధ్య ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారినట్లు ఆ సంస్థ పేర్కొంది. గ్రామాల్లోని పిల్లలకు లెక్కల్లో కూడికలు, తీసివేతలు కూడా రావడం లేదని నివేదికలో తెలిపింది. దీంతో ఏపీ విద్యా ప్రమాణాలపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.