కాకినాడ జిల్లాలోని ఏలేరు వరదపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షించారు. సహాయక చర్యలపై కలెక్టర్‌కు కీలక సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మరోవైపు సోమవారం పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై కలెక్టరేట్లో అధికారులతో సమావేశం అవుతారు. ఏలేరు వరద కారణంగా ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలకు ముంపు ముప్పు పొంచివుంది.