కోడిపందాలు ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్

77చూసినవారు
కోడిపందాలు ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్
రంగంపేట మండలం వడిసలేరులో కోడిపందాలు ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రంగంపేట ఎస్సై విజయ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు చేసి కోడిపందాలు ఆడుతున్న 8మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రెండు కోడి కత్తులు, రూ. 2290 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్