విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అనపర్తి ఎమ్మెల్యే విజేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో నారా లోకేష్ కొద్దిసేపు ముచ్చటించారు. అనపర్తి నియోజకవర్గ విశేషాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు.