

రాజమండ్రి: మే డే స్ఫూర్తితో పని విధానాన్ని కాపాడుకుందాం
అంతర్ జాతీయ కార్మిక దినోత్సవం మే డే స్ఫూర్తితో 8 గంటల పని విధానాన్ని కాపాడుకుందాం అని, లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమిద్దాం అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. పవన్ పిలునిచ్చారు. గురువారం రాజమండ్రిలోని సీఐటీయూ కార్యాలయంలో మే డే సందర్బంగా ప్రత్యేక కరపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. ప్రపంచ కార్మికవర్గ చరిత్రను 1886 అమెరికాలోని చికాగోలో జరిగిన కార్మిక తిరుగుబాటు మలుపు తిప్పిందన్నారు.