ఉగాది పండుగ సందర్భంగా రాజమండ్రిలోని పాత సోమలమ్మ గుడి వీధిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఆఫీస్ ను ఎంపీ అభ్యర్థి రుద్రరాజు మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం వ్యతిరేక రిజర్వేషన్ బిల్లును ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటికి పూర్తిగా వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ ద్వారా ప్రజా పాలన తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.