అత్యవసర మరమ్మతుల నిమిత్తం మంగళవారం రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ సోమవారం తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రకాష్ నగర్, గాంధీపురం-2, 3, శ్యామల నగర్, రామాలయం సెంటర్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించాలని సూచించారు.