తూ. గో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 13వ తేదీన ధవళేశ్వరంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ కృష్ణన్ సోమవారం తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈ క్యాంపస్ సెలెక్షన్ నిర్వహిస్తున్నామన్నారు. హాజరయ్యే విద్యార్థులు తమ సర్టిఫికెట్స్, నకలు కాపీలు, రెస్యూమ్ తో హాజరు కావాలని కోరారు.