విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమర వీరుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అంబాజీపేట హెచ్సీలు నారాయణ, ప్రసాద్ తెలిపారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా అంబాజీపేట ఉన్నత పాఠశాల విద్యార్థులతో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అను నిత్యం పోరాడుతున్నారని, విరామం లేకుండా విధి నిర్వహణలో ప్రాణాలను సైతం అర్పిస్తున్నారన్నారు.