కాకినాడకు జాతీయస్థాయిలో రైఫిల్ షూటింగ్ లో గుర్తింపు తీసుకురావాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీన పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసిన రైఫిల్ షూటింగ్ ను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీన, రైఫిల్ షూటింగ్ కోచ్ ఆలీషా, షరీఫ్ తదితరులు ప్రారంభించారు.