ఐ. పోలవరం ఎస్సైగా మల్లికార్జున రెడ్డి

57చూసినవారు
ఐ. పోలవరం ఎస్సైగా మల్లికార్జున రెడ్డి
ఐ. పోలవరం ఎస్సైగా ఆర్. మల్లికార్జున రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఏలూరు నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. రిజిస్టర్లో సంతకం పెట్టి నూతనంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్