ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి నట్లు ఐ. పోలవరం ఎస్సై భానుప్రసాద్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన రంగిశెట్టి శ్రీనివాసు అరెస్టు చేసి, అతని నుంచి 13 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఐ. పోలవరం, ముమ్మిడివరం, కాట్రేని కోన, నర్సాపురం మండలాల్లో చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు.