పిఠాపురంలో 17కోట్ల విలువైన బంగారం సీజ్

66చూసినవారు
గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్ఎస్ఈ బృందం శుక్రవారంరాత్రి తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వస్తున్న సీక్వెల్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వాహనాలు తనిఖీలు చేపట్టగా అందులో బంగారు, వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సరైన ధ్రువపత్రాలు చూపక పోవడం, తరలించే వ్యక్తుల పేర్లూ పత్రాల్లో నమోదు చేయకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి పిఠాపురం తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్