అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ

70చూసినవారు
అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ
రాజమండ్రి నగరంలోని దేవీచౌక్ వద్ద జరుగుతున్న దసరా ఏర్పాట్లను మంగళవారం జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీనవరాత్రులను పురస్కరించుకుని ఎక్కడా అవాంఛనీయ సంఘటన జరగకుండా, ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం లేకుంగా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తే ఆర్గనైజర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్