బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులు జ్యోతీరావు పూలే అని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జ్యోతీరావు పూలే వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి మాట్లాడారు. జ్యోతిరావు ఫూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడని, తన జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడారన్నారు.