రాజానగరం: పేదలందరికీ ఇల్లు పథకంలో వేల కోట్ల అవినీతి

75చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇల్లు పథకంలో వేల కోట్ల అవినీతి జరిగిందని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఎందుకు పనికిరాని 'ఆవ భూములను' కొనుగోలు చేసి పేద ప్రజలకు పంపిణీ చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించే ప్రణాళికలు రూపొందించాలన్నారు.

సంబంధిత పోస్ట్