వైభవంగా సత్తమ్మ తల్లి అమ్మవారికి కుంకుమ పూజలు

80చూసినవారు
వైభవంగా సత్తమ్మ తల్లి అమ్మవారికి కుంకుమ పూజలు
సఖినేటిపల్లి మండలం పరిధిలోని శృంగవరపాడు గ్రామంలో వేంచేసి ఉన్న సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సోమవారం జరిగిన అమ్మవారి కుంకుమ పూజలలో స్థానిక మహిళలు భారీగా పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం స్థానికులు చెల్లుబోయిన మితీష్, దుర్గా శ్రావణి దంపతుల ఆర్థిక సహాయంతో భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్