తలుపులమ్మ లోవకు పోటెత్తిన భక్తజనం

60చూసినవారు
తలుపులమ్మ లోవకు పోటెత్తిన భక్తజనం
తుని మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో దేవస్థానంలోని వసతి గదులు నిండిపోవడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలో చెట్లు క్రింద వంటావార్పు చేసుకుని సామూహిక భోజనాలు చేశారు. ఈ ఒక్క రోజునే 15వేలు మంది భక్తులు దర్శించుకున్నారు అని ఈఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్