కోటనందూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు మండల ఎంపిపి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ లగుడు శ్రీనివాస్ అధ్యక్షతన కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. హాస్పిటల్ నందు రోగిల పై జాగ్రత్తల గురించి సూచించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జి. శివలక్ష్మి దొరబాబు, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ, ఎమ్మార్వో సత్యనారాయణ , చింతకాయల చిన్నబాబు , హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.