
కాకినాడ రూరల్: కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పాలన
కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పాలన సాగుతుందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పిల్లి అనంతలక్ష్మి కళ్యాణ మండపంలో ఇటీవల ఎమ్మెల్సీగా విజయం సాధించిన పేరా బత్తుల రాజశేఖర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం గుర్తించడం జరుగుతుందన్నారు.