
కడియం: రైతు లేనిదే రాజ్యం లేదు
రైతు లేనిదే రాజ్యం లేదని, రైతే రాజుని, మానవ మనుగడకు ఆహారమే ప్రాధాన్యమని అలాంటి ఆహారాన్ని మనకు అందిస్తున్న అన్నదాతలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని జేగురుపాడు సర్పంచ్ సతీష్ చంద్ర స్టాలిన్ అన్నారు. సోమవారం కడియం మండలంలోని జేగురుపాడులో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆదర్శ రైతులను గౌరవించి వారి సేవలను కొనియాడారు.