పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో డిసెంబర్ 6 నుండి ఏలూరు జిల్లాస్థాయి జనసేన మెగా వాలీబాల్ టోర్నమెంట్ పోటీల నిర్వహిస్తున్నట్టు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ కు సంబంధించి కరపత్రాలను నియోజకవర్గ ఇన్చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలో ఉన్న క్రీడాకారులు అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.