

మైలవరంలో గండ్లు పూడ్చివేత పనులు
మైలవరం నియోజకవర్గంలో గత ఏడాది అకాల వర్షాల వల్ల బుడమేరు, వాగులు, చెరువులు, కాల్వలకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పూడ్చివేత పనులకు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. కవులూరు శివార్లలో బుడమేరు, తారకరామా కాలువ వద్ద పనులను ఆయన బుధవారం పర్యవేక్షించారు. వ్యవసాయ సీజన్ ముందు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.