ఈదులగూడెం లో టిడిపి పార్టీ ఆత్మీయ సమావేశం

52చూసినవారు
ఈదులగూడెం లో టిడిపి పార్టీ ఆత్మీయ సమావేశం
తెలుగుదేశం పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని నూజివీడు టిడిపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం నూజివీడు నియోజకవర్గం పరిధిలోగల ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామంలో టిడిపి పార్టీ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలన్నీ పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్