రేపు తాడేపల్లిగూడెంలో మెగా జాబ్ మేళా

78చూసినవారు
రేపు తాడేపల్లిగూడెంలో మెగా జాబ్ మేళా
తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలోని శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. పదవ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, డిప్లమో పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులుగా పేర్కొన్నారు. ఆరు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్