రేపు సంకటహర చతుర్థి

61చూసినవారు
రేపు సంకటహర చతుర్థి
తణుకు మండలం, మండపాక గ్రామంలో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం నందు శనివారం సంకటహర చతుర్థి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రదోషకాల అర్చనలు జరగనున్నాయని ఆలయ అర్చకులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామికి ప్రీతికరమైన భాద్రపద మాసం, సంకటహర చతుర్థి నాడు ప్రదోషకాలంలో గరికలతో స్వామివారిని అర్చించినట్లయితే జీవితంలో సంకటములు తొలగి గణపతి అనుగ్రహం సిద్ధిస్తుందని వివరించారు.

సంబంధిత పోస్ట్