ఏపీకి వాయుగుండం ముప్పు.. భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో గురువారం నాటికి ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం 23వ తేదీ నాటికి అల్పపీడనంగా బలపడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 27, 28 తేదీల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.