పవన్ వస్తే గానీ సభ నిర్వహించలేకపోయారు : కోలగట్ల

75చూసినవారు
పవన్ వస్తే గానీ సభ నిర్వహించలేకపోయారు : కోలగట్ల
పవన్ వస్తే గానీ యువగళం విజయోత్సవ సభను నిర్వహించలేకపోయారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభ్రదస్వామి అన్నారు. గురువారం విజయనగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ’పాదయాత్రలోని అనుభవాలను, ప్రజల సమస్యలను కనీసం సభలో చెప్పలేదు.. సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు ఇటు పవన్, అటు బాలయ్యను పెట్టుకొని సభను నిర్వహించారు. నీ కొడుకుకు ఉద్యోగం ఇచ్చావు గానీ మరెవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు‘ అని కోలగట్ల అన్నారు.

సంబంధిత పోస్ట్