AP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఎన్‌టీటీపీఎస్‌లో కోల్ ప్లాంట్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. కోల్ ప్లాంట్ టీపీ-94ఏ2 బెల్టు వద్ద భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆందోళనకు గురైన కార్మికులు పరుగులు పెట్టారు. సమాచారం మేరకు ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.