AP: DSC అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో డిఎస్సీ ఉచిత కోచింగ్ శనివారం నుంచి ప్రారంభమైంది. గుంటూరులో డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ను మంత్రి సవిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ డిఎస్సీ కోచింగ్ సమయంలో రూ.1500 స్టైఫండ్, మెటీరియల్ కోసం రూ.1,000 ఇస్తామని తెలిపారు. త్వరలోనే 16,347 పోస్టుల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు.