గ్యాస్ లీక్.. 30 మంది అస్వస్థత

77చూసినవారు
గ్యాస్ లీక్.. 30 మంది అస్వస్థత
తిరుపతి జిల్లాలోని రాజులపాలెం సీఎంఆర్ కర్మాగారంలో శనివారం గ్యాస్ లీకైంది. సీఎంఆర్ ఎకో అల్యూమినియం కర్మాగారంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 20 మంది మహిళలతో సహా 30 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను రేణిగుంట బాలాజీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్