AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 నుంచి మ.12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు.
ALL THE BEST