కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ’చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని జగన్ ట్విట్టర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.