వేసవి కాలం కారణంగా సందర్శకులు, ఖైదీల సౌలభ్యం కోసం గుంటూరు జిల్లా జైలులో ములాఖత్ సమయాలలో మార్పులు చేసినట్లు జైలు పర్యవేక్షకులు రఘు శుక్రవారం తెలిపారు. ఈ మార్పులు వెంటనే అమలులోకి వస్తాయని ఆయన చెప్పారు. ములాఖత్ సమయం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 4 నుంచి 5 గంటల వరకు ఉంటుందన్నారు. సవరించిన సమయాలు జూన్ 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.