ఈనెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

63చూసినవారు
ఈనెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి గుంటూరు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం ఈనెల 12కు బదులుగా 13 నుంచి ప్రారంభించడం జరుగుతుందని డీఈవో శైలజ మంగళవారం తెలిపారు. జిల్లాలోని ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి స్కూల్స్ రీ ఓపెన్ చేస్తే బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్