తాడేపల్లి పరిధి ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా విచ్చేసారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ చంద్రబాబు అమిత్ షా కి విందు ఏర్పాటు చేశారు. విందు తర్వాత కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందే అమిత్‌షా రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడ నోవాటేల్ లో అమిత్ షా బసచేయనున్నారు.