మహిళా మార్ట్ లో నిధులపై విచారణ

78చూసినవారు
అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో మహిళ మార్ట్ నిధులపై ఇటీవల వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ విచారణ కమిటీని ఆదేశించారు. ఆర్డీవో సూర్యనారాయణ తో పాటు పలువురు అధికారులు శనివారం మార్ట్ నిధులపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో సూర్యనారాయణ మాట్లాడుతూ మార్ట్ లోని లావాదేవీల పై సిఎంఎం చూపించిన రికార్డులను పరిశీలించడం జరిగిందని అన్నారు. దర్యాప్తు రిపోర్టును కలెక్టర్ కు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్