పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో శాఖ కేటాయింపు

56చూసినవారు
పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో శాఖ కేటాయింపు
గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రివర్గంలో శాఖ కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా ఆయనను నియమించారు. సోమవారం పెమ్మసాని చంద్రశేఖర్ దిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీగా 3, 44, 695 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్