ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

52చూసినవారు
ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ
ర్యాగింగ్ చేయడం వలన విద్యార్థులు మంచి భవిష్యత్తును కోల్పోతారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ సదస్సులో ఎస్పీ అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ర్యాగింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పోలీసు కేసుతో పాటు కళాశాల నుంచి సస్పెండ్ కి గురవుతారని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రుల కల నెరవేర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్