కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు

85చూసినవారు
కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు చేపట్టినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలు బుడంపాడు జంక్షన్, తెనాలి, వేమూరు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలన్నారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి నాలుగో తేదీ కౌంటింగ్ ముగిసే వరకు మళ్లింపు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు పోలీసులకు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్