గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జనసేన నేతలు, మంగళవారం గుంటూరులో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్వగృహంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపుకు కృషి చేసినందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గురజాల జనసేన నేతలను అభినందించారు. ఎంపీని కలిసిన వారిలో జనసేన నేతలు దూదేకుల కాశీం సైదా, దూదేకుల సలీం, తదితరులు ఉన్నారు.