
పిడుగురాళ్ల: ఏపీయూడబ్ల్యూజే కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
పిడుగురాళ్ల ఏపీయూడబ్ల్యూజే కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. వర్కింగ్ జర్నలిస్టులు సమిష్టిగా కలిసి నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు గ్రూపులుగా ఉన్న ఏపీయూడబ్ల్యూజే శుక్రవారం నుంచి ఒకే కమిటీగా ఏర్పాటయింది. కమిటీ నూతన అధ్యక్షులుగా గుత్తా పేరయ్య, కార్యదర్శి షేక్ రంజాన్ వలి, కోశాధికారి సూరపు మణికంఠ(చిన్నా), ఉపాధ్యక్షులు దామిశెట్టి నవీన్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.