మాచర్లలో రౌడీలు, గుండాల పరిపాలన: జూలకంటి

62చూసినవారు
మాచర్ల మండలంలోని నాగార్జున సాగర్ లో మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గంలో రౌడీలు, గూండాల పరిపాలన నడుస్తోందన్నారు. సాగర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పిన్నెల్లి చెంచాగాళ్లను వదిలిపెట్టేది లేదన్నారు. సాగర్ లో అడబిడ్డలపై అఘాయిత్యం చేసినా చెప్పుకోని దుస్తుతి ఏర్పడిందన్నారు. రౌడీలే ప్రజల భవిష్యత్ ను నిర్ణయిస్తున్నారని, రౌడీ వెధవలకు తలవంచితే భవిష్యత్ ఉండదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రౌడీలు, గుండాలను అణచివేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్