మాచర్ల పట్టణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. వెంకటేశ్వర సెంటర్లో టీడీపీ నాయకులు దుర్గారావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.