జ్యోతిబా ఫూలే ఆశయాలు అందరికీ స్పూర్తిదాయకం

549చూసినవారు
కులవివక్ష, అంటరానితనంపై పోరాటం చేసిన బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలు అందరికీ స్పూర్తిదాయకమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. ఫూలే జయంతిని పురస్కరించుకుని గురువారం తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫులే సేవలని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్