రోడ్లు పక్కన రాళ్లు, కర్రలు లేకుండా చూడాలి

79చూసినవారు
నరసరావుపేట మండల పరిధిలో రోడ్ల పక్కన కంకర రాళ్లు, కర్రలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్ ఛార్జ్ ఈవో పిఆర్డి ప్రసాద్ ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం పెట్లూరివారిపాలెం గ్రామంలో బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టే ప్రదేశాలను సందర్శించి ఇంటి యజమానులతో మాట్లాడారు. కొత్తగా ఇండ్లు నిర్మించుకునే వారు కంకర రాళ్లు, కర్రలు రోడ్డు పక్కన అందుబాటులో లేకుండా చూసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్