గర్భిణీ స్త్రీలకు మాగులూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. గైనకాలజిస్ట్ విద్య, డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ పౌష్టికాహారం పంపిణీ చేయడం గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా జబ్బులకు దూరంగా ఉండవచ్చును అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మాగలూరి కృష్ణారావు, కిరణ్, ఏపూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.