భారీ వర్షాల కారణంగా అమరావతి లోని వాగులు, మురుగు కాలువల వరద పోటెత్తడంతో రహదారులు తీవ్రంగా దెబ్బతిని ఎక్కడికక్కడ తెగిపోయాయి. తారు పోయి కంకరరాళ్లు కనబడుతున్నాయి. భారీగా గోతులతో జనం నానా యాతన పడుతున్నారు. చాలా చోట్ల కోతకు గురయ్యాయి. వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సి ఉంది. అనూహ్యంగా చొచ్చుకొచ్చిన వరద నీరు పలు చోట్ల గత అయిదు రోజులుగా రోడ్ల పై ప్రవహిస్తూనే ఉంది.